ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతుందా… అంటే జౌననే మాటే పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది. ఇప్పటికే మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకుని అందరికి షాక్ ఇచ్చింది జగన్ సర్కారు. ఒకే దెబ్బకు ఇటు ప్రతిపక్షానికి, అటు ప్రజలకు కూడా రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చింది. తాజా మరో కీలక నిర్ణయానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో జిల్లాల పునర్వభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న ఎంపీల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా విభజన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. జనగణన ప్రక్రియ పూర్తయ్యేలోగా జిల్లా విభజన ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. కాగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే..ఏపీలో కొత్తగా అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూ పూర్, తిరుపతి, రాజంపేట ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడుగా మరో 12 జిల్లాలు అవతరించే అవకాశం ఉంది.
ఏపీలో మళ్లీ తెరపైకి వచ్చిన జిల్లాల పునర్వభజన అంశం…!
-