ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇజ్రాయెల్ కంప్లీట్ ట్రావెల్ బ్యాన్

-

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైన, భయకరమైన వేరియంట్ అన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికా, కేసులు నమోదైన బొట్సావానా, హంగ్‌కాంగ్‌లకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఆయా దేశాలకు రాకపోకలు బంద్ చేయగా, తాజా ఇజ్రాయెల్ అన్ని దేశాలకు రాకపోకలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది.

అన్ని దేశాల విదేశీ ప్రయాణికులు తమ దేశంలో రాకుండా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు శనివారం ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నట్ తెలిపారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీరును అంచనా వేసిన తర్వాత 14 రోజుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్రావెల్ బ్యాన్ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నది. ఒమిక్రాన్ కారణంగా దేశ సరిహద్దులను మూసివేసిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news