కరోనా దెబ్బకు కుదేలైన నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న నిర్మాణ రంగానికి మరో దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణారంగంపై ప్రభావం పడింది. ముఖ్యంగా కూలీల కొరత, లాక్ డౌన్ల కారణంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి సిమెంట్ ధరల రూపంలో నిర్మాణ రంగంపై భారం పడే అవకాశం కనిపిస్తోంది.
దేశంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మార్కెట్ వర్గాలు కూడా క్లారీటీ ఇచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో రీటైల్ మార్కెట్ సిమెంట్ బస్తాధర రూ. 10-15 పెరిగింది. ఇప్పుడు మరోసారి రూ. 15-20 కి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో సిమెంట్ ధర ఆల్ టైమ్ హైకి చేరుకునే అవకాశం ఉంది. దాదాపుగా రూ. 400కు పెరుగనుంది. సిమెంట్ ధరల పెరుగుదలకు బొగ్గు, డిజిల్ ధరలు పెరగడమే కారణం అని అంటున్నారు.