వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. పైగా వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలేమీ ఉండవు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే కేవలం ఇంట్లోని ఆఫీస్ లోని మాత్రమే కాకుండా వాహనాలకు సంబంధించిన కూడా వాస్తుని అనుసరించవచ్చు.
ఇలా పాటించడంవల్ల సమస్య లేకుండా ఉంటాయి. అలానే నెగటివ్ ఎనర్జీ కూడా రాదు. ఎప్పుడు కూడా మీ యొక్క కార్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. కారు తలుపులు, కార్పెట్ మొత్తం అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే సమస్యలేమీ లేకుండా ఉండాలంటే కార్ లో దేవుడు ఫోటోలని పెట్టుకోవాలి.
ముఖ్యంగా వినాయకుడి ఫోటోని పెట్టుకోవడం వల్ల ఏ విఘ్నాలు లేకుండా ఉండొచ్చు. అలానే కారు లో నెగటివ్ ఎనర్జీ తొలగించాలంటే రాళ్ల ఉప్పు లో బేకింగ్ సోడా వేసి దానిని కార్లో తరచూ జల్లుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది.
కార్ లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే కూడా మంచి కలుగుతుంది. కారులో మంచి మ్యూజిక్ పెట్టుకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా ఈ విధంగా మీరు కారులో అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించి ఆనందంగా ఉండండి.