స్టీల్ ప్లాంట్ ప‌రిశ్ర‌మ కాదు, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం : పవన్ కళ్యాణ్

-

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే ఆయన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా అధికారుల వైసిపి పార్టీ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే.. వైసీపీ పార్టీ నాయకులు బూతులు తిడ‌తారని అగ్రహించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 152 మంది ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యాఖ్యమ చేశారు పవన్. పోరాటాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున‌న్నామని.. స్టీల్ ప్లాంట్ కేవ‌లం ఒక ప‌రిశ్ర‌మే కాదు, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం అని వెల్లడించారు. ప్రైవేటీక‌ర‌ణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయ‌డ‌మేనని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువగా ఉన్న అధికార వైసిపి పార్టీ కేంద్రాన్ని గట్టిగా అడగాలని కానీ ఆ విషయంలో అధికార వైసిపి పార్టీ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news