బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న అఖండ… 100 కోట్ల క్లబ్ లో బాలయ్య మూవీ..

నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణ నటించిన ’అఖండ‘ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. టాలీవుడ్ లో  రాబోయే భారీ సినిమాలకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చింది అఖండ. ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా బాలయ్య వందకోట్ల క్లబ్ లో చేరారు. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా హ్యట్రిక్ కొట్టింది. కరోనా తరువాత థియేటర్లకు వస్తున్న ప్రైక్షకులు అఖండ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ మార్క్​ను టచ్​ చేసిందని తెలిసింది.​ అలాగే రూ.61.5కోట్ల షేర్​ను దాటిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీని కన్నా ముందు బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి బాక్సాఫీసు వద్ద రూ. 75 కోట్లను వసూలు చేసింది. ఆ సినిమా రికార్డులను తిరగరాస్తూ.. అఖండ వందకోట్లను కలెక్ట్ చేసింది.

మరోవైపు  ఓవర్సీస్ లోను అఖండ అరాచకం కొనసాగుతోంది. అఖండ మూవీ విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా బాలయ్య కెరీర్​లో తొలిసారిగా 1మిలియన్​ మార్క్​ను అందుకోబోతుంది. ఇప్పటికే 9లక్షల 50వేల డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అనగానే అఖండ విడుదలకు ముందే క్రేజీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీలు ఘనవిజయం సాధించడంతో… అఖండపై కూడా అంచానాలు భారీగా నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే అఖండ వసూళ్లను కొల్లగొడుతోంది.