విశాఖ స్టీల్ ప్లాంట్ పై అప్పులు బాగా అయ్యాయని ప్రైవేటీకరణ చేస్తున్నారని.. పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ కారణంగా రాష్ట్రానికి కూడా బాగా అప్పులు అయ్యాయని… మరి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని నిలదీశారు. అందరం కలిసి.. పోరాటం చేయాలని కోరారు. తాను వెళ్లి కేంద్రంలో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారని… గతేడాది బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు అమరావతే రాజధాని ఉండాలని కండీషన్ పెట్టానని పవన్ పేర్కొన్నారు.
బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒప్పుకుందని… మొన్న తిరుపతి సభలో అమిత్‌షా కూడా అమరావతే రాజధాని అని చెప్పారని వెల్లడించారు. వైసీపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని అగ్రహించారు. ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన నాకే కేంద్రం గౌరవం ఇస్తుంటే మీరేం చేస్తున్నారని తెలిపారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్రానికి కాదు.. అడిగే పద్దతి లేదని వైసీపీ పై నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందని నిలదీశారు పవన్ కళ్యాణ్.