పరిటాల ఫ్యామిలీకి ఆ బంపర్ ఆఫర్ లేదా?

-

గత ఎన్నికల్లో చంద్రబాబు అనేక ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపాల్సిన కొందరు నాయకులని పార్లమెంట్ స్థానాల్లో దింపారు..అలాగే ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని రూల్ పెట్టారు. ఇలా పలు ప్రయోగాలు చేశారు. కానీ చంద్రబాబు ప్రయోగం ఏది వర్కౌట్ కావడం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు ఇలాంటి ప్రయోగాలు జోలికి వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే పార్టీ గెలుపు గురించి ఆలోచిస్తే..ఒక కుటుంబానికి, ఒకటే టిక్కెట్ అనే రూల్ పెట్టడం కష్టమే. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీల వల్ల టీడీపెకి అడ్వాంటేజ్ ఉంది.

ఇదే క్రమంలో పరిటాల ఫ్యామిలీ వల్ల టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో దింపారు. కానీ జగన్ గాలిలో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక పరిటాల ఫ్యామిలీకి మరొక నియోజకవర్గం బాధ్యత కూడా అప్పగించారు. ధర్మవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్ళడంతో అక్కడ టీడీపీకి నాయకులు లేరు.

దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. రెండు నియోజకవర్గాలని పరిటాల ఫ్యామిలీనే చూసుకుంటుంది. అయితే ఈ సారి సునీతమ్మ..రాప్తాడు బరిలో, శ్రీరామ్..ధర్మవరం బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ చివరిలో ట్విస్ట్ వచ్చేలా ఉంది.

ఎందుకంటే ధర్మవరంలో బీజేపీలోకి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మళ్ళీ తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారని తెలుస్తోంది. అంతేగానీ బీజేపీలో ఉంటే ఆయన గెలవడం కష్టం. అందుకే మళ్ళీ టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయన టీడీపీలోకి వస్తే…ధర్మవరం టిక్కెట్ ఇస్తారో లేదో చూడాలి. ఆ టిక్కెట్ ఇస్తే పరిటాల ఫ్యామిలీకి రెండు చోట్ల పోటీ చేసే బంపర్ ఆఫర్ పోయినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news