రెండు కొవిడ్ వ్యాక్సిన్లు, మెర్క్స్ మాత్రకు అనుమతి: 10 ముఖ్యమైన అంశాలు

-

కొవిడ్-19 పోరాటంలో మరో ముందడుగు పడింది. మరో రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యాంటీ వైరల్ డ్రగ్‌కు సైతం అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్లలో ఇండియాకు చెందిన కొర్బేవాక్స్, కోవోవాక్స్ ఉన్నాయి. యాంటీ-వైరల్ డ్రగ్ మెల్నూపిరవిర్ అత్యవసర సమయంలో వినియోగించవచ్చు.

– కోర్బోవాక్స్ తొలి స్వదేశీ ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీ ట్వీట్ చేశారు. ఈ వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ తయారు చేసింది.

– ఇది హ్యాట్రిక్. భారత్ విజయవంతంగా మూడో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిందని మాండవీయ పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.

– కోవోవాక్స్ అనే నానోపార్టికల్ వ్యాక్సిన్‌ను పుణెకు చెందిన సీరం తయారు చేసింది.

– యాంటీ-వైరల్ డ్రగ్ మెల్నూపిరవిర్‌ ఇండియాకు చెందిన 13 కంపెనీలు తయారు చేయనున్నాయి. వయోజనులైన కొవిడ్-19 బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో మెల్నూపిరవిర్‌ను ఉపయోగించడానికి అత్యవసర అనుమతులు మంజూరు చేశారు.

– కొత్తగా అత్యవసర అనుమతులు మంజూరైన వాటితో కలిపి దేశంలో మొత్తం ఎనిమిది వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి కొవిషీల్డ్, కోవ్యాక్సిన్, జైకోవ్-డి, స్పుత్నిక్-వి, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, కోర్బోవ్యాక్స్, కోవోవాక్స్

– యాంటీ-వైరల్ డ్రగ్ మెల్నూపిరవిర్‌‌ను అత్యవసర సమయంలో వినియోగించడం కోసం అనుమతులు కోరుతూ డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నేతృత్వంలోని సిప్లా, మైలన్, టోరెంట్, ఎమక్యూర్, సన్ ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేశాయి.

– అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల మెర్క్‌కు చెందిన మోల్నుపిరావిర్‌ను తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉన్న పెద్దలలో తేలికపాటి నుంచి మితమైన కొవిడ్-19 కేసుల చికిత్స కోసం అనుమతించింది.

– యాంటీ-వైరల్ డ్రగ్ మెల్నూపిరవిర్‌‌ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. హాస్పిటల్‌లో చేరడం, మరణాలను 30శాతం తగ్గించినట్లు వెల్లడైంది.

– దేశంలో 60ఏండ్ల పైబడిన వారితోపాటు ఫ్రంట్‌లైన్ హెల్త్‌‌కేర్ వర్కర్స్‌కు వచ్చే నెల 10 నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. వచ్చే నెల 3 నుంచి 15-18ఏండ్ల మధ్య పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభంకానున్నది.

Read more RELATED
Recommended to you

Latest news