BREAKING : “ఆర్ఆర్ఆర్” మూవీ మళ్ళీ వాయిదా !

-

ఆర్.ఆర్ ఆర్ చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో… మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో థియేటర్ల పై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇవాళ ఏ సమయంలో అయినా… వాయిదా పై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అంటూ ట్విట్టర్ లోనూ ట్రెండింగ్ అవుతోంది. కాగా ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమాను విడుద‌ల చేస్తుండ‌టంతో అన్ని భాష‌ల్లోనూ ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news