ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీకి భారీ అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కాన్వాయ్ ని నిరసనకారులు 20 నిమిషాలపాటు అడ్డుకున్నారు. దీంతో పంజాబ్లో బహిరంగ సభను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై తాజాగా మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు.
ఒక దేశ ప్రధాని రైతులు.. 20 నిమిషాలు ఆపడం చరిత్రలో ఎక్కడా లేదని చురకలంటించారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురుగా లేదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు.
రైతులకు కోపం వస్తే ప్రధానిని అలానే అడ్డుకుంటారని.. వాళ్ల పాలన అలా ఉండటం కారణంగానే నిరసనకారులు కాన్వాయ్ ను అడ్డుకుంటారని పేర్కొన్నారు. జేపీ నడ్డా అబద్ధాల అడ్డా అంటూ బీజేపీ పై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. మోడీ సర్కార్ సిగ్గులేని ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా చిల్లర మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని… ఫైర్ అయ్యారు.