లైఫ్ ఇన్సూరెన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4693 ఉద్యోగాలు

-

సెంట్రల్ గవర్నమెంట్‌లో ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ పరంపరలో భాగంగా ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీలో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు సంక్షిప్తంగా.. త్వరలో ఆయా ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ ప్లాన్, చదవాల్సిన బుక్స్ వివరాలను అందిస్తాం.

  •  జూనియర్ ఇంజినీర్, స్టెనో, టైపిస్ట్ తదితర పోస్టులు
  •  చివరితేదీ: మార్చి 25
  •  ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక

దేశంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, స్టెనో తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టులు: 4103
(నార్త్ జోన్-1999, సౌత్ జోన్- 540, ఈస్ట్ జోన్-538, వెస్ట్ జోన్-735,
నార్త్ ఈస్ట్ జోన్-291)
– సౌత్ జోన్ పరిధిలో జూనియర్ ఇంజినీర్ (సి-విల్-26, ఎలక్ట్రికల్/మెకానికల్-15, స్టెనో (గ్రేడ్2)-7, టైపిస్ట్-3, గ్రేడ్3 అసిస్టెంట్ (జన-రల్-159, అకౌంట్స్-48, టెక్నికల్-54, డిపో-213), అసిస్టెంట్ గ్రేడ్ 2 (హిందీ)-15 ఖాళీలు ఉన్నాయి.

Lic And Food corporation of india 4693 vacancies
Lic And Food corporation of india 4693 vacancies

అర్హతలు: జూనియర్ ఇంజినీర్ (సివిల్ /ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచీల్లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్, స్టెనో గ్రేడ్2 పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు డీవోఈఏసీసీ ఒ లెవల్ లేదా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్), కంప్యూటర్/షార్ట్-హ్యాండ్ టైపింగ్ సామర్థ్యం, అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ పోస్టులకు హిందీ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచి-లర్ డిగ్రీ/పీజీతోపాటు ఇంగ్లిష్ నుంచి హిందీ ట్రాన్స్-లేషన్ చేయాలి. టైపిస్ట్ (హిందీ) పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ+హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. గ్రేడ్3 అసిస్టెంట్ (జనరల్, డిపో) పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గ్రేడ్3 అసిస్టెంట్ (అకౌంట్స్)కు కామర్స్ డిగ్రీ/బీకాం ఉత్తీర్ణత. గ్రేడ్-3 అసిస్టెంట్ (టెక్నికల్) పోస్టులకు బీఈ/బీటెక్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.

వయస్సు: 2019 జనవరి 1 నాటికి జూనియర్ ఇంజినీర్/అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ పోస్టులకు 28 ఏండ్లు, స్టెనో గ్రేడ్2/టైపిస్ట్‌లకు 25 ఏండ్లు, అసిస్టెంట్ గ్రేడ్3 పోస్టులకు 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎ-స్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: జూనియర్ ఇంజినీర్‌లకు
రూ. 11,100-29,950/- అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ/స్టెనో పోస్టులకు
రూ. 9,900-25,530, టైపిస్ట్/
అసిస్టెంట్ గ్రేడ్3 పోస్టులకు రూ. 9,300-22,940/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1 పరీక్ష, ఫేజ్-2 పరీక్ష), స్కిల్ టెస్ట్ ఆధారంగా
ముఖ్యతేదీలు:
అప్లికేషన్ ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25
ఆన్‌లైన్ టెస్టు తేదీలు: 2019 ఏప్రిల్/మే
వెబ్‌సైట్: http://fci.gov.in

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 590 ఏఏవోలు

ముంబైలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి-యా(ఎల్‌ఐసీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో)
మొత్తం పోస్టులు: 590
(జనరల్-237, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-144, ఎస్సీ-92,ఎస్టీ-58)
విభాగాలవారీగా ఖాళీలు: జనరలిస్ట్-350, ఐటీ-150, చార్టెర్డ్ అకౌంటెంట్-50, అక్చ్యూరి-యల్-30, రాజభాష-30.

Lic And Food corporation of india 4693 vacancies
Lic And Food corporation of india 4693 vacancies

అర్హతలు: జనరలిస్ట్ విభాగానికి- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఐటీ విభాగానికి-బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), చార్టెడ్ అకౌంటెంట్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ ఫైనల్, అక్చ్యూరియల్ విభాగానికి- బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అక్చ్యూరిన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత. రాజభాష విభాగానికి- ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (హిందీ/ ఇంగ్లిష్) లేదా హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ (సంస్కృతం) ఉత్తీర్ణత.

వయస్సు: 2019 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 32795- 62315/- (నెలకు సుమారుగా రూ. 56,000/-)
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది

ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్), పర్సనల్ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ రాతపరీక్ష:
ఇంగ్లిష్ లాంగ్వేజ్-30,
రీజనింగ్ ఎబిలిటీ-35,
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు.
కాలవ్యవధి: గంట
– ప్రిలిమినరీలో కనీస అర్హత మార్కులు సాధించిన-వారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్- 300 మార్కులు, డిస్క్రిప్టివ్-25 మార్కులకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ-లకు రూ. 100

ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 22
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీలు: మే 4, 5
మెయిన్ ఎగ్జామ్ తేదీ: జూన్ 28
వెబ్‌సైట్: www.licindia.in

– కేశవ

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి

Read more RELATED
Recommended to you

Latest news