మహిళలకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం, భారీగా తగ్గిన వెండి ధరలు

-

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్‌… అంతా ఇంతా కాదు. దీని డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా మన దేశం లో అయితే.. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే దానికి లేదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు పెరగకుండా స్థిరంగా నమోదు అయ్యాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో గురు వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 000 గా ప‌లుకుతుంది. అయితే… బంగారం ధరలు నిలకడగా నమోదు అయితే… వెండి ధరలు మాత్రం విపరీతంగా తగ్గి పోయాయి. తాజాగా రూ. 400 తగ్గింది వెండి ధర. దీంతో కేజీ వెండి ధర రూ. 65,500 కు చేరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news