మెగాబ్రదర్స్ డిఫరెంట్ వర్షన్స్‌తో మెగా అభిమానులు టోటల్‌గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే సొంత సామాజికవర్గమైన కాపుల్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది..అసలు వారు జనసేనకు సపోర్ట్ ఇవ్వాలా లేక జగన్‌కు సపోర్ట్ ఇవ్వాలా అనే విషయంపై కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికి కారణం చిరంజీవి అనే చెప్పొచ్చు. ఎందుకో చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పొచ్చు. చిరంజీవి సినిమా పెద్దగా ఉండనని చెప్పి…సినిమా పెద్దగానే ముందుకెళుతూ జగన్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు.
అసలు పవన్ కల్యాణ్…జగన్ ప్రభుత్వంపై ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. గత రెండున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై పవన్ యుద్ధం చేస్తున్నారు. వైసీపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాపుల్లో కూడా జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైంది. అయితే ఇలా ఇలాంటి తరుణంలో వారిని చిరంజీవి కన్ఫ్యూజన్‌లో పడేశారని చెప్పొచ్చు. వాస్తవానికి చిరంజీవి రాజకీయాల్లో లేరు..కానీ ఆయన రాజకీయాలని ప్రభావితం చేయగలరు. ఆ శక్తి చిరుకు ఉంది…తన అభిమానులని, కాపు వర్గాన్ని ప్రభావితం చేయగలరు.
అంత శక్తి ఉన్న చిరంజీవి… జగన్‌కు అనుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. పైగా జగన్ కూడా తెలివిగా చిరంజీవినే ముందుపెడుతున్నట్లు కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో అనేకమంది పెద్ద నటులు ఉన్నారు….వారిని కూడా పిలిస్తే బాగుండేది..కానీ జగన్, చిరుని మాత్రమే పిలవడం వెనుక రాజకీయం కోణం ఉందని అంతా అనుమానిస్తున్నారు.
అదే సమయంలో చిరంజీవి సినిమా టిక్కెట్ల అంశంపై పరిష్కారం దొరికిందో లేదో క్లారిటీ ఇవ్వకుండా, జగన్ మంచిగా భోజనం పెట్టారు… తన సూచనలని విన్నారు.. జగన్ అందరి మనిషి అన్నట్లు పరోక్షంగా పొగడ్తల వర్షం కురిపించారు. దీని వల్ల కాస్త సీన్ మారింది.. .మెగా అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్తితి వచ్చింది. చిరంజీవి మాటలని బట్టి చూస్తే కొంత జగన్ పట్ల పాజిటివ్‌గా మారవచ్చు. ఇక పవన్ ఎంట్రీ ఇచ్చి ఆ పరిస్తితి మార్చల్సిన అవసరం ఉందని, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. లేదంటే జనసేనకు డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.