BREAKING : ఆధారాలతో ”క్యాసినో” వీడియోను రిలీజ్‌ చేసిన టీడీపీ

-

గుడివాడ కె కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని ఆధారాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియాకు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విడుదల చేశారు. క్యాసినో నిర్వహాకుడు ప్రేమల్‌ టోపీ వాలా ఫేస్ బుక్‌ అకౌంట్లల్లోని వీడియోలను మీడియాకు రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… కొడాలి కన్వేన్షన్‌లోనే క్యాసినో నిర్వహించారని అన్ని ఆధారాలు బయటపెట్టాం, నిన్నటి సవాల్‌కు సమయం, సందర్భం ఎప్పుడో కొడాలి నానినే తేల్చుకోవాలన్నారు.

తన కన్వెన్షన్‌లో క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని బుకాయించారని… నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని సవాల్ కూడా విసిరారని స్పష్టం చేశారు. నేను బయటపెట్టిన ఆధారాలపై కొడాలి నాని ఏం సమాధానం చెప్తారు..? అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఏమూలకు వెళ్లినా ఇలాంటి వీడియోలు కోకొల్లలు అని… ఒక మంత్రి బరితెగించి బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..? అని ఫైర్‌ అయ్యారు. 3 రాజధానులకు తోడుగా నాలుగోది జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా..? సీఎం, డీజీపీల మౌనం చూస్తుంటే రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news