ఆడియో టేప్ లపై పూనం కౌర్ మౌనమేలా..?

-

పవన్ కళ్యాణ్, పూనం కౌర్ ల మధ్య అసలు ఏం జరిగింది..? హీరోయిన్ గా కూడా క్లిక్ అవని పూనం అంత పెద్ద స్టార్ తో ఎలా పరిచయం ఏర్పడింది..? పవన్, పూనం ల రిలేషన్ పై ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి. కత్తి మహేష్ బయటపెట్టిన పవన్, పూనం కౌర్ ల మ్యాటర్ ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది. పూనం కౌర్ కూడా ఆ కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యింది లేదు.

అయితే లేటెస్ట్ గా పవన్ గురించి పూనం మాట్లాడుతూ ఉన్న ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి నలిగిపోయిన ఆ ఆడియో టేప్ మళ్లీ పవన్, పూనం ల మ్యాటర్ వార్తల్లో నిలిచేలా చేసింది. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని కొందరు అంటుంటే. తన వాయిస్ తో రిలీజైన ఆడియో టేప్ పై పూనం ఎలాంటి స్పందన తెలియచేయకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

తాను నోరు తెరిస్తే జనసేన మూతపడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం ఆ విషయాల పట్ల క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ ఆడియో టేప్ నిజంగానే పూనం కౌర్ దేనా కాదా అన్నది కూడా క్లారిటీ లేదు. మరి వీటి సమాధానం ఎప్పుడు దొరుకుంతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news