చదువుకున్నారా లేక… గాడిదలు కాశారా : ఏపీ సర్కార్‌ పై ఉద్యోగుల సంచలనం

-

ఏపీ సర్కార్‌ పై మరోసారి పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. చదువుకున్నారా లేక… గాడిదలు కాశారా అంటూ ఏపీ సర్కార్‌ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని.. సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..అని నిలదీశారు.

బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోందని… మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయని మండిపడ్డారు. మా పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం మాకు లేదా..? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఇప్పటికే చాలా ఒపిక పట్టాం ఇంకా ఆగితే మాకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉందని.. ఇన్నేళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు..? అని నిలదీశారు. ఉద్యోగుల అలవెన్సులు తగ్గించి జీతాల్లో కోత పెట్టారని.. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుకోవాలని హెచ్చరించారు. ఇంతవరకు ఒక్కసారే మేం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూశామని.. మా కడుపు మంటను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news