వెస్టిండీస్ సిరీస్ కు రోహిత్ శర్మ ఫిట్.. బీసీసీఐ ఫిట్ నెస్ టెస్ట్ లో పాస్

-

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. వెస్టిండీస్ తో ఇండియాలో జరుగబోయే సిరీస్ కు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నారు. బీసీసీఐ నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ లో రోహిత్ పాసయ్యాడు. వెస్టిండీస్ తో జరుగబోయే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండనున్నారు.

ఇటీవల ముగిసన సౌతాఫ్రికా టూర్ కు ముందు రోహిత్ శర్మ గాయాల బారిన పడ్డారు. దీంతో ఈ టూర్ మొత్తానికి దూరం అయ్యారు. దీంతో జట్టుపై తీవ్ర ప్రభావం కనిపించింది. టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ లను కోల్పోయింది. అత్యంత దారుణంగా మూడు వన్డేల సిరీస్ లో ఒక్కదాంట్లో కూడా ఇండియా నెగ్గలేదు… దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది.

కాగా ఈనెల వెస్టిండీస్ తో ఇండియా మూడు వన్డేలను, మూడు టీ20లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి 3 వన్డే మ్యాచులు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా మూడు టీ20 మ్యాచులను నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news