కేటీఆర్, హరీష్ రావు కీలక ఆదేశాలు… వారికి ఇంటి వద్దకు వెళ్లి టీకాలు

-

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ వ్యక్తి కరోనా టీకాలు తీసుకునే విధంగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జీహెచ్ఎంసీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల ఆదేశాలతో 60 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి బూస్టర్ డోసు వేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీని కోసం జీహెచ్ఎంసీ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఒకటి కన్నా ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, ఇతర కారణాలతో బూస్టర్ డోస్ వేసుకోని వారు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111 కు ఫోన్ చేయాలన్నారు. ఈ నిర్ణయంతో టీకా సెంటర్ రాలేని వారికి ఉపశమనం కలుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news