పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : సజ్జల

-

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉంది.. పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటే సవరిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామన్నారు. రికవరీలు ఏమీ లేవు.. ఐఆర్ వేరు.. రికవరీ వేరు అని పేర్కొన్నారు.మంత్రు కమిటీతో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు అయ్యారని.. వారు గతంలో ఇచ్చిన డిమాండ్ లలో ఒకటి ఇక వర్తించదని తెలిపారు.

ఎందుకంటే ఇప్పటికే జీవో ప్రకారం కొత్త వేతనాలు వారి ఖాతాల్లో పడిపోయాయని.. ఓపెన్ మైండ్ తోనే చర్చలు చేస్తున్నామన్నారు. వారికి అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం మాకెందుకు ఉంటుందని.. కొన్ని అంశాలను సర్దుబాటు, మార్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు. రికవరీలు లేవు కనుక కోర్టు పేర్కొన్న విషయం వర్తించదని.. ఐఆర్ లో సర్దుబాటు సాధారణం అని చెప్పారు. జీవోలోనూ రికవరీ అని పేర్కొనలేదని.. ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుంచి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం సరికాదని వెల్లడించారు. హై కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసినట్టు తెలిసిందని.. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామనీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news