తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..త్వరలోనే 40వేల ఉద్యోగాలు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌…కేంద్ర ప్రభుత్వం పెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ పై ప్రెస్‌ మీట్‌ పెట్టి.. బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే… ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త కూడా చెప్పారు. త్వరలోనే… 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. 317 జీవోతో… నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కావాలనే కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

KCR-TRS
KCR-TRS

అలాగే..తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే … అవసరం అస్సలు లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియా లో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. తమకు 103 సీ ట్లు ఉన్నాయని… ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని ప్రశ్నించారు. ఎవరో చె ప్పిన మాటలు అస్సలు నమ్మకూడదు అని… మరో రెండేళ్ల పాటు తమ పాలన కొనసాగుతుందని చెప్పారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news