ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మత తత్వ రాజకీయాలను రేపే విధంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు గుళ్ల ధ్వంసంపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసింది బీజేపీ పార్టీ. ఇక ఇప్పుడు.. గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పై వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ పార్టీ. అయితే.. ముస్లింకు అనుకూలంగా ఉన్న జిన్నా టవర్ ను ధ్వసం చేయాలని గత కొన్ని రోజుల నుంచి.. బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది.
ఇలాంటి తరుణంలో… గుంటూరు కార్పొరేషన్ మేయర్ మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫా, మరికొంత నేతలు జిన్నా టవర్ కు జాతీయ జెండాలోని మూడు రంగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న జిన్నా టవర్ కు మూడు రంగులు వేసి.. జాతీయతను చాటుకున్నారు. అలాగే రేపు టవర్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై బీజేపీ పార్టీ నాయకులు సీరియస్ అవుతున్నారు.