దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగం నడుస్తోంది- తలసాని శ్రీనివాస్ యాదవ్

-

దేశంలో నరేంద్రమోదీ రాజ్యాంగం నడుస్తుందని.. దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేని అన్నారు. గ్రామీణ అభివ్రుద్ధి నిధులకు కూడా కోత విధించిందని విమర్శించారు. దేశంలో 40 కోట్ల జనాభా ఉన్న దళిత, గిరిజనులకు బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణకు బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించడం లేదని తెలంగాణ భారత దేశంలో లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు జరగాల్సిన వాటి కోసం రాజ్యాంగసవరణ జరగాలి. బీజేపీ మతాలను రెచ్చగొట్టడం తప్పితే చేసిందేం లేదని విమర్శించారు. ఆదాయ పరంగా దేశాన్ని నడిపించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. తెలంగాణకు రూపాయి కూడా తేసుకురాని చేతగాని దద్దమ్మలంటూ.. బీజేపీ నాయకులను విమర్శించారు. సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు బీజేపీ, కాంగ్రెెస్ నేతలు కుక్కలు మొరిగినట్లు మొరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 103 సార్లు రాజ్యాంగ సవరణ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ ను విమర్శించిన అరుణ్ శౌరీని మంత్రి చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులిచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news