జగన్ సంచలన నిర్ణయం..అమరావతిలో 480 ఎకరాలు తాకట్టు!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. పీకల్లోతు అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ప్రస్తుతం ఏపీలో నెలకొంది. పదుల సంఖ్యలో పథకాలు, ఇతర ఖర్చులతో ఏపీ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా తయారయింది. ఇక్కడ అప్పులు దొరికితే అక్కడికి వెళుతుంది ఏపీ సర్కార్. ఆస్తులను తాకట్టు పెట్టిన అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇక తాజాగా ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

మూడు రాజధానులు బిల్లు, సి ఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లు ను ఉపసంహరించుకున్న తర్వాత ప్రభుత్వ తీరుపై చాలా అనుమానాలు వచ్చాయి. మళ్లీ మూడు రాజధానులు బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతోంది కానీ… అమరావతి భూములు కోట్లకు కోట్లు చేస్తాయని తాకట్టు పెట్టడం ప్రారంభించింది. సిఆర్డిఏ కు రాజధానికి రైతులు ఇచ్చిన వాట్ హలో 480 ఎకరాల భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది.

మూడు రోజుల కిందట ఉద్యోగులు పెన్ డౌన్ చేసిన అప్పుడే రాజధానిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సిబ్బంది రప్పించి పని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరికీ తాకట్టు పెట్టారు.. ఇంతకు తాకట్టు పెట్టారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం చెబుతుందా ? లేదా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news