సీఎం కెసిఆర్ మంచి ఉద్దేశంతో రాజ్యంగంపై కామెంట్ చేశారని.. ఏ ఉద్దేశంతో అన్నారు అనేది చర్చ పెట్టాలన్నారు బాల్క సుమన్. సీఎం కెసిఆర్ అనగానే రాజ్యాంగం మారిపోతుందా.! అని ప్రశ్నించారు. రాజ్ నాథ్ కూడా లౌకిక అనే పదం తీసేయాలి అని అన్నారని.. మొదటగా రాజద్రోహం కేసు రాజ్ నాథ్ మీద పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు సమ్మె చేసినా..ప్రైవేటు పరం చేస్ కుట్ర మోడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తెలంగాణ పై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాదన్నారు. విశాఖ ఉక్కు కి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా..నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేసిందని ఆగ్రహించారు. విశాఖ ఉక్కు లాగానే… సింగరేణి నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కేంద్రం పద్దతి మార్చుకోకపోతే ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. . తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ మోడీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్దం అవ్వాలని.. బీజేపీ నేతలను నిలదీయడం తో కేంద్రం కి సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు.