కల్వకుంట్ల రాజ్యాంగంలో.. వంగి దండాలు పెట్టాలా? : బండి సంజయ్‌ ఫైర్‌

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ ప్రజాప్రతినిధులు హౌజ్ అరెస్టు చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి నిర్బంధించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌజ్ బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల నాయకులను హౌజ్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.

గత రెండ్రోజులుగా జనగాం జిల్లా కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగంలో జీ హుజూర్..అంటూ వంగి దండాలు పెట్టాలా? అని నిలదీశారు.

‘‘ గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే… జనం సంతోషంగా ఉండేవాళ్లు. సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ఉండేది. జనం వినతి పత్రాలతో సీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు. కానీ సీఎం కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నరు. ప్రతిపక్షాల ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట చేస్తున్నరు. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నరు. సామాన్య ప్రజలను కట్టడి చేస్తూ నిర్బంధిస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో మరెక్కడా చూడలేదు.’’అని బండి సంజయ్ పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news