‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియరైంది..

-

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఆర్జీవీ డైరెక్టర్. అయితే.. ఈ సినిమాపై మొదటి నుంచీ ఎన్నో వివాదాలు తలెత్తాయి. అదొక్కటే కాదు.. లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాకు కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి.

అయితే.. ఈ సినిమాల విడుదలను ఆపాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కు లైన్ క్లియరైంది.

అయితే.. రెండు సినిమాల్లో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈసందర్భంగా విచారణ సమయంలో రాష్ట్ర ఆడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. తెలంగాణలో సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఆ సినిమా వల్ల శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా తమ పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటారని హైకోర్టుకు తెలిపారు. దీంతో సినిమా విడుదలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



లక్ష్మీ పార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాలను పరిగణనలోకి తీసుకొని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తీశారు. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ మార్చి 22న రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ… అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ లేటయింది. దీంతో మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా మార్చి 22న రిలీజ్ అవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news