చలో విజయవాడ కార్యక్రమం ఒక్కటి సక్సెస్ కావడం, ఇంటెలిజెన్స్ ఫెయిల్ కావడం ఈ రెండు పరిణామాలూ కూడా జగన్ ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డినే ఈ రోజు డీజీపీగా నియమించడం.దీంతో ఇప్పుడీ వివాదం మరింత ముదిరేందుకు, సీన్లోకి ఐపీఎస్ అధికారుల సంఘం వచ్చేందుకు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రావనిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తప్పించి కొత్త డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వడంపై ఇప్పుడు కలకలం రేగుతోంది.రాజకీయ వర్గాల్లో ఇదే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది.అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనను తప్పించి రాజేంద్ర నాథ్ రెడ్డికి డీజీపీగా నియమించడంతో పాటు, ఇప్పటిదాకా పనిచేసిన డీజీపీని అవమానకర రీతిలో తప్పించి,ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జగన్ వైఖరిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇటీవల చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఉద్యోగులను కట్టడి చేయడంలో విఫలం అయిన డీజీపీని వెనువెంటనే తప్పించి ఆయన స్థానంలో సొంత సామాజికవర్గ నేతకు ఆ హోదాను కట్టబెట్టడంపై విమర్శలు రేగుతున్నాయి.
ముఖ్యంగా సీనియర్లను కాదని జగన్ ఆయనకు ఈ హోదాను కట్టబెట్టారని 12 మంది సీనియర్లను కాదని మరీ ఆయనకు ఈ హోదా కట్టబెట్టారని అభియోగాలు మరియు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మొన్నటి వేళ పీఆర్సీ సాధన సమితి నిర్వహించిన చలో విజయవాడను సమర్థంగా కట్టడి చేయడంలో ప్రభుత్వం చెప్పిన మేరకు ఉపాధ్యాయులను నియంత్రించడంలో విఫలం కావడంతో ఆయనకు ఈ ఉద్వాసన తప్పలేదు అని జనసేన కూడా అభిప్రాయపడింది.అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందే ఈ తగాదా విషయమై స్పందించింది.ఇక జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మరో వివాదం కూడా నడుస్తోంది.అదే బాబాయ్ వివేక హత్య కేసు.ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో,ఈ కేసు పురోగతిని అడ్డుకునేందుకే ఆయనీ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా జనసేన చేస్తోంది.