సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయాలంటే టీఆర్ఎస్ నేతల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు..ఎందుకంటే అసలు టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సెంటిమెంట్ మీద…దాని మీద బేస్ అయ్యే ఆ పార్టీ నడుస్తోంది. అలాగే 2014, 2018 ఎన్నికల్లో అదే సెంటిమెంట్‌తో గెలిచి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది..సరే రెండు సార్లు ఎలాగో సెంటిమెంట్‌తో గెలిచారు..మరి ఈ సారైనా తాము చేసిన పనులని చెప్పుకుని గెలుస్తారా? అంటే అబ్బే ఈ సారి కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని కారు పార్టీ వాడుతుంది.
ఇప్పటికే ఆ మేరకు రాజకీయం చేయడం మొదలుపెట్టారు…బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్…ఆ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందనే కోణాన్ని తీసుకొస్తుంది. కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్..తెలంగాణకు పెద్ద విలన్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటీవల మోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలని తెలంగాణ సెంటిమెంట్ రగల్చడానికి వాడుతున్నారు.
పైగా టీఆర్ఎస్ నేతలు ఎప్పటిలాగానే తెలంగాణని ఏపీలో కలిపేస్తారని ప్రచారం మొదలుపెట్టారు…2018లో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడి రాజకీయంగా లబ్ది పొందారు. ఇంకా చంద్రబాబు వస్తే..ఏపీని తెలంగాణలో కలిపేసుకుంటారని ప్రచారం చేశారు. అప్పుడు ఆ ప్రచారం వర్కౌట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే తరహా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు లాంటి వారు మాట్లాడుతూ..మోదీ..తెలంగాణని మళ్ళీ ఏపీలో కలపడానికి చూస్తున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఇక తాజాగా మంత్రి కేటీఆర్ సైతం అదే తరహాలో మాట్లాడటం మొదలుపెట్టారు. నరేంద్ర మోదీకి ప్రధానిగా మరో అవకాశమిస్తే తెలంగాణ, ఆంధ్రాను కలిపేస్తారని అన్నారు. అంటే కేటీఆర్ కూడా ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలని లేపే పనిలో ఉన్నారు. అయితే ఏపీలో తెలంగాణ కలవడం అనేది అసాధ్యం…ఆ విషయం అందరికీ తెలుసు…కానీ కావాలని టీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ రగిలిస్తున్నారు. అయితే రాజకీయంగా వేరే విషయాలు నమ్మోచ్చు గాని..ఈ సెంటిమెంట్‌ని మాత్రం తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశాలు లేవు.