బ్రిటన్ కు రష్యా కౌంటర్… తమ గగనతలం నుంచి బ్రిటన్ విమానాలు వెళ్లకుండా బ్యాన్

-

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. ఆదేశాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా రష్యా దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేలా రష్యన్ ఆర్మీ ముందుకు కదులుతోంది. మరికొన్ని గంటల్లో రాజధాని కీవ్ రష్యా ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ ప్రభుత్వమే ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించిన రష్యాపై యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా మండిపడుతున్నాయి. తన చర్యలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ… అమెరికా, రష్యాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా. యూఎస్‌లోని 4 రష్యా బ్యాంకుల ఆస్తులు ఫ్రీజ్‌ చేయడంతో పాటు 250 బిలియన్‌ డాలర్ల వీటీబీ బ్యాంక్‌ ఆస్తులు ఫ్రీజ్ చేయనున్నారు.

 

మరో వైపు యూకే కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తోంది. యూకే ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యా బ్యాంకులను తొలగించారు. యూకే నుంచి రష్యా నిధులు సమీకరించకుండా… ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలపై నిషేధం. ఇటీవలే 5 రష్యా బ్యాంకులపై నిషేధం విధించాయి యూరోపియన్ దేశాలు. ముగ్గురు రష్యా అపరకుబేరుల అకౌంట్లను ఫ్రీజ్ చేసింది.

దీంతో రష్యా కూడా యూకేకు కౌంటర్ ఇచ్చింది. తమ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది రష్యా. దీంతో రష్యా గగతతలం నుంచి వెళ్లే యూకే విమానాలను బ్యాన్ చేసింది. తమ దేశంలో బ్రిటన్ విమానాల ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ… నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news