Aadavallu Meeku Joharlu : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. మూవీ రివ్యూ !

-

శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న తాజా సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ రొమాంటిక్ మూవీకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ, సీనియర్ నటి రాధిక అలాగే ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్స్ అందరూ నటిస్తున్నారు.మొత్తానికి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. అయితే.. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మొత్తానికి ఈ సినమాపై పాజిటివ్‌ టాకే వస్తోంది.

కథ : రాధికా శరత్‌ కుమార్‌, ఊర్వశి వల్ల శర్వానంద్‌ పెళ్లి కాకుండా బ్యాచిలర్‌ గా ఉంటాడు. అదే సమయంలో చిరకు ఆద్య (రష్మికా మందనా) ఎదురుపడుతుంది. క్రమంగా ఆద్య మీద ఇష్టం పెరిగి పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటాడు హీరో శర్వానంద్‌. కానీ ఆద్య తల్లిగా నటించిన ఖుష్భూ కు మాత్రం వీరి పెళ్లి ఇష్టం ఉండదు. ఆద్యను, వారి కుటుంబ సభ్యులను ఎలా హీరో శర్వానంద్‌.. ఒప్పించాడు, ఎలా ఆద్యను దక్కించుకున్నాడనేది సినిమా కథాంశం.

నటీ- నటుల ప్రదర్శన

రాధికా, ఊర్వశి, ఖుష్భు లాంటి సీనియర్‌ హీరోయిన్లను ఒకే సినిమాలో చూడటం ఆడవాళ్లు మీకు జోహార్లుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ గా మారింది. బోర్‌ కొట్టని కామెడీ, ఫామిలీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కూడా ఈ సినిమాకు మరో ప్లస్‌. ఇందులో ఎవరి పాత్రలో వారు ఒదిగి పోవడం, అన్ని పాత్రలకు సమానంగా ప్రాధాన్యత దక్కడం లాంటి విషయాలను చాలా జాగ్రత్త గా డీల్‌ చేశాడు దర్వకుడు కిషోర్‌ తిరుమ.

రివ్యూ రేటింగ్‌ : 2.5/ 5

Read more RELATED
Recommended to you

Latest news