Happy Birthday Ram Charan : మెగా వారసుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-

తానెవరో తెలియకుండా హీరోగా నెగ్గుకు రావడం స్టార్ ఇమేజ్ సాధించడం ఎంత కష్టమో.. ఓ పెద్ద స్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవడమూ అంతే కష్టం. స్టార్ తనయుడు అంటే కేవలం అవకాశాలు మాత్రమే వస్తాయి కాని సక్సెస్ లు వారు టాలెంట్ తో రాబట్టాల్సిందే. అలా స్టార్ తనయులుగా టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్న వారిలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో వెండితెరకు పరిచయమైన చరణ్ మెగా వారసత్వాన్ని నిలబెట్టాడని చెప్పొచ్చు.

రెండవ సినిమానే మగధీర అంటూ అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగ రాసిన చరిత్ర రాం చరణ్ పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకుంటూ నటన పరంగా కూడా ఎంతో పరిణితి సాధించాడు రాం చరణ్. రంగస్థలం ముందు వరకు రాం చరణ్ కేవలం చిరంజీవి కొడుకు, ఓ మాస్ హీరో అన్న భావన ఉండేది కాని కరెక్ట్ సినిమా పడితే తానేంటో ప్రూవ్ చేసుకుంటానని అన్నట్టుగా చరణ్ రంగస్థలంలో అదరగొట్టాడు.

రాం చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనేలా రంగస్థలం సినిమా ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లో రామ రాజు పాత్రలో నటిస్తున్నాడు రాం చరణ్. రాజమౌళి సినిమా అంటే ఇక ఆలోచించాల్సి ఏముంటుంది. మన్యం వీరుడు సీతరామరాజుగా రాం చరణ్ ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈరోజు రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి ఏదైనా పోస్టర్ వస్తుందని భావించారు కాని ప్రెస్ మీట్ అప్పటి ఫోటోకే హ్యాపీ బర్త్ డే అని పెట్టి రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ తో నటుడిగా చరణ్ మరో మెట్టు ఎక్కాలని.. కెరియర్ లో కూడా రాం చరణ్ ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని భావిస్తూ మనలోకం.కామ్ నుండి మెగా పవర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news