BREAKING : అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అ య్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యే అలాగే.. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ నేతలు సభలో గందర గోళం సృష్టించారు. గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో సంభ పూర్తిగా గందరగోళంగా మారి పోయింది.

గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు టీడీపీ పార్టీ సభ్యులు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు మార్షల్స్. మండలి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ నారా లోకేష్ మండి పడ్డారు.

సభలో మాట్లాడనివ్వడం లేదు.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు మార్షల్స్. దీంతో మార్షల్సుతో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వాగ్వావాదానికి దిగారు. ప్రస్తుతం అసెంబ్లీ లాబీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news