టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ఒక్కసారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రేమ పొంగి పోయింది. భీమ్లా నాయక్ సినిమా వేడి తగ్గిన తర్వాత.. నిన్న సినిమా టికెట్ల ధరలపై జీవో విడుదల చేశారు. అయితే.. సినిమా టికెట్ల ధరలు పెంచడమే కాకుండా.. ఏపీలో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది జగన్ సర్కార్. ఈ నిర్ణయం ప్రకారం.. ఏపీలో.. ఐదు షోలు వేసుకోవచ్చు.
అయితే ఈ 5 షో లలో ఉదయం 11 గంటలకు, రాత్రి 9 గంటలకు చిన్న సినిమాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. ఇక మున్సిపాలిటీల్లో నాన్ ఏసీ థీయేటర్స్ లో టికెట్ ధరలు రూ. 30, రూ. 40 గా, ఏసీ థీయేటర్స్ లో రూ. 60, రూ. 80 గా, మల్టీ ప్లెక్స్ లలో రూ. 125 గా కేటాయించింది.
అలాగే కార్పోరేషన్ లలో నాన్ ఏసీ థీయేటర్స్ లలో టికెట్ ధర రూ. 40, రూ. 80 గా, ఏసీ థీయేటర్స్ లలో రూ. 70, రూ. 100 గా, మల్టీప్లెక్స్ లో రూ. 150, రిక్లైనర్ రూ. 250 గా కేటాయించింది. అలాగే నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో టికెట్ ధర.. నాన్ ఏసీ థీయేటర్స్ లలో టికెట్ ధర రూ. 20 , రూ. 40 గా, ఏసీ థీయేటర్స్ లలో రూ. 50, రూ. 70 గా, మల్టీ ప్లెక్స్ లలో రూ. 100 గా కేటాయించింది.