నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పై కొంత వరకు వ్యతిరేకత ఉండేది. కానీ నిన్నటి రోజున అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో ఆ వ్యతిరేకత అంతా… బుడిదైపోయింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉండేవాళ్లు. కానీ నేడు సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగ భర్తీ ప్రకటన చేసిన తర్వాత.. ఆయనే దేవుడంటూ.. నిరుద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారు.
అయితే.. తెలంగాణ నిరుద్యోగులు పాలభిషేకాలు చేస్తే పర్లేదు.. కానీ.. ఏపీలోనూ ఆయనకు పాలభిషేకాలు చేస్తుండటమే ఇక్కడ పాయింట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హర్షిస్తూ.. విశాఖలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పాలభిషేక్ చేసింది. 91 వేల ఉద్యోగాల భర్తీ చేస్తున్నందుకుగానూ కేసీఆర్ కు జేఏసీ అభినందనలు తెలిపింది. ఏపీలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని.. వయోపరిమితిని పెంచాలని కోరారు.