విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఈఆర్సీది : ట్రాన్సుకో ఎండీ

-

విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఈఆర్సీదని ట్రాన్సుకో ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. ఏపీలోని అన్ని రకాల విద్యుత్ సంస్థలకు రూ. 83 వేల కోట్ల మేర అప్పు ఉందని.. రూ. 1400 కోట్లు రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా డిస్కంలకు ఆదాయం వస్తోందని తెలిపారు. రూ. 6.90 పైసల మేర విద్యుత్ కొనుగోలు ఛార్జీ అవుతోందని.. విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్ లోకి వస్తారని వెల్లడించారు.

50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని.. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమేనని.. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఈఆర్సీదని స్పష్టం చేశారు.

గతంలో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకున్నారని.. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వేసవి కారణంగా డిమాండ్ పెరిగింది.. అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతోందని.. వాస్తవానికి సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని.. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదన్నారు. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదు.. ధరలను సమీక్షించమనే ప్రభుత్వం కంపెనీలను కోరిందని.. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును వివియోగిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news