తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది.రాహుల్ గాంధీతో సీనియర్ల భేటీ అనంతరం పరిస్థితులన్నీ చక్కబడి నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారన్న వాతావరణం కనిపించింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని రాష్ట్రానికి రావాల్సిందిగా కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఈ నెలాఖరున ఏదైనా సభ ఏర్పాటు చేయవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానానికి ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమతి కూడా తీసుకున్నారు.
పర్యటన తేదీ మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంతో మూడు రోజుల అనుమతి తీసుకున్నారు.ఈనెల 25, 26, లేదా 28 తేదీల్లో భారీ బహిరంగ సభ కోసం ఆర్ట్స్ కళాశాల మైదానానికి అనుమతి పొందారు.పోలీసుల నుండి కూడా సమావేశానికి అనుమతి తీసుకున్నారు.రాహుల్ గాంధీ రాకపై శుక్రవారం జరిగిన టీపీసీసీ మావేశంలో లో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.ఓరుగల్లులోని భారీ బహిరంగ సభకు ప్రతి నియోజక వర్గం నుండి పదివేల మందిని తరలించాలని టిపిసిసి యోచిస్తోంది.