వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 30 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పై కేపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రశాంత్ కిషోర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సేవలందించలేక చల్లగా పీకే జారుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. 2008లో కెసిఆర్ తనను కలిశారని తెలిపారు. తన మద్దతు కోరగా తాను దేశ జాలు లేకుండా అందించామని వివరించారు కే ఏ పాల్.
అయితే టిఆర్ఎస్ తెలంగాణ లో అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. టిఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. రాష్ట్రం నెత్తి మీద నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు