అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధ కారణంగా జన్మించిన బిడ్డలు ఊరుసు తీసింది ఓ తల్లి.. ఎవ్వరికీ తెలియకుండా నవజాత శిశువు మృతదేహాన్ని మాయం చేయబోయి ఊచలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఇద్దరు బిడ్డల తల్లయిన మహిళ తన భర్త మామ సైఫుల్ ఇస్లాంతో గత రెండేండ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే.. వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కారణంగా బుధవారం మహిళ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సమయంలో ఆమె భర్త కేరళలో ఉన్నాడు. తమకు పుట్టిన బిడ్డ గురించి ఎవరికీ తెలియకుండా చిన్నారిని చంపేయాలని మహిళ ప్రియుడు సూచించాడు.
అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ప్రియుడితో కలిసి ఆ చిన్నారిని కర్కశత్వంతో కడతేర్చింది. నవజాత శిశువుచే ఉప్పు తినిపించి పొట్టనపెట్టుకుంది. పసికందును చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంటివెనుక పాతిపెడుతుండగా.. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళతో పాటు.. ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.