ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే రోజూ అత్యాచార ఘటనలు చోటు చేసుకోవడంతో.. ఇటు ప్రభుత్వానికి, అటు పోలస్ శాఖకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మృగాళ్లను కఠినంగా శిక్షించిందుకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. అయినప్పటికీ కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా రాత్రి విజయనగరంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది.
విజయనగరంలో ఓ వివాహిత (25) తన పిల్లలు, సోదరుడితో కలిసి ఉంటోంది. అయితే అర్థరాత్రి ఓ హెడ్‌కానిస్టేబుల్ కొడుకు చెర్రీ (19) తన ఇద్దరు స్నేహితులతో కలిసి సదరు వివాహితపై.. పిల్లలు, సోదరుడు చూస్తుండగానే అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో సదరు మహిళ పక్కనే ఉన్న సోదరి ఇంట్లో దాక్కున్నా.. వదలకుండా మరోసారి అత్యాచారం చేశారు. రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకూ అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్త సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు.