బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ సవాల్… దమ్ముంటే కరీంనగర్ అభివృద్దికి వెయ్యి కోట్లు తీసుకురా

-

అడ్డమైన మాటలు మాట్లాడుడు కాదని… నీకు దమ్ముంటే కరీంనగర్ అభివృద్దికి రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసురావాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కు ప్రధాని మోాదీ దగ్గర పలుకుబడి ఉంటే నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వయసు చూసేది లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడనే విశ్వాసం లేకుండా విమర్శిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. జీవితంలో  కూడా తెలంగాణ రాకపోయేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే టీపీసీసీ, టీ బీజేపీ వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తులు కూడా ఎగిరెగిరి పడుతున్నారంటూ విమర్శించారు. కొందరు అన్ని మోదీ పైసలతోనే డెవలప్ అవుతుందని అంటున్నారని… పక్క రాష్ట్రం కర్ణాిటక వెళ్లి చూడాలని హితవు పలికారు. తెలంగాణ పల్లెల్లో ఉన్న గోదాములు, పల్లె వనాలు, వైకుంఠధామాలు వేరే రాష్ట్రాల్లో లేవని అన్నారు. అడ్డమైన మాటలు మాట్లాడుడు కాదని.. అభివృద్దిలో పోటీ పడుదాం అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news