మంత్రి బొత్సని విద్యాశాఖ నుంచి త‌ప్పించాలి : నారా లోకేష్

-

పదో తరగతి పరీక్షల్లో లీక్‌, మాస్‌ కాపీయింగ్‌తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నాప‌త్రాలు ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తోందని, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్ క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్ కి చేరకుండానే ముందుగా వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమ‌వుతున్నాయని లోకేష్ లేఖలో ఆరోపించారు. వైసీపీ నాయ‌కుల పిల్లల‌కు మెరుగైన మార్కుల కోసం ఈ లీకులు చేస్తూ బ‌రితెగించార‌ని ఆయన మండిపడ్డారు. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం మీ ప్రభుత్వంపై నిర‌స‌న తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ ప‌రీక్షల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలున్నాయని, జగన్ పాల‌న‌లో భ్రష్టుప‌ట్టిన విద్యాశాఖ‌, ఆ శాఖ‌ని చూసే మంత్రుల వ‌ల్ల ఇంకా ప‌త‌నావ‌స్థకి చేరిందని ఆయన లేఖలో అన్నారు.

Nara Lokesh expresses shock over attack on infant's dad

పేప‌ర్ల లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌పై మీ మంత్రి బొత్స ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని ఇచ్చిన స‌మాధానం బాధ్యతారాహిత్యమని, మంత్రి బొత్సని విద్యాశాఖ నుంచి త‌ప్పించాలని లోకేష్ లేఖలో డిమాండ్ చేశారు. ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా ప‌క‌డ్బందీగా నిర్వహించాలని, టెన్త్ ప‌రీక్షల ఘోర‌ వైఫ‌ల్యంతోనైనా ప్రభుత్వం గుణ‌పాఠం నేర్చుకుని ఇంట‌ర్ ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా నిర్వహించాలని హితవు పలికారు. అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వహిస్తోన్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని, పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించ లేక ప్రభుత్వం అభాసుపాలైందని ఆయన ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news