csk vs rcb: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై…. తుది జట్లు ఇవే.

-

ఐపీఎల్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగబోతోంది. పూణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత చెన్నై జట్టులో ఊపొచ్చింది. మరో వైపు బెంగళూర్ టీం కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఫామ్ లేక సతమతమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇంతకుముందు పుణే వేదికగా జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ టేబుల్ లో చెన్నై 9 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా… బెంగళూర్ 10 మ్యాచుల్లో ఐదింటిలో గెలిచింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, MS ధోని(w/c), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

Read more RELATED
Recommended to you

Latest news