ఒకప్పుడు యుద్ధం వేరు.. ఇప్పుడు యుద్ధం వేరు. వీలున్నంత వరకూ యుద్ధం చేసేందుకు సరిపడినంత సమయం కన్నా సమర్థతే ముఖ్యం. ఆ విధంగా చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయి కూడా ! ప్రజా క్షేత్రంలో పాలక పక్షాలపై విపక్షాలు నిరసనలు చేయకపోతే, ధర్నాలకు వెళ్లకపోతే ఆయా పార్టీ ల మనుగుడ ఎక్కడ? అన్న సందేహం వస్తుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో గతం కన్నా ఎక్కువ సమస్యలే ఉన్నాయి.
లా అండ్ ఆర్డర్ విఫలతపై మాట్లాడాల్సినంత మాట్లాడడం లేదు ఎవ్వరూ ? అదేవిధంగా మిగిలిన పార్టీల కన్నా కార్యకర్తల శ్రేణి ఎక్కువగా ఉన్న టీడీపీలో కూడా ముఖ్య నేతలు కదిలితేనే దిగువ స్థాయి నాయకులు కదులుతున్నారు. రోడ్డెక్కి తమ బాధను చెప్పగలుగుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు నిన్నటి వేళ ప్రజా స్వామ్యంలో పౌరుల హక్కు గురించి, ధర్నాల ఆవశ్యకత గురించి పదే పదే చెప్పకనే చెప్పారు. పోలీసుల అణచివేత ఉన్నా కూడా భయపడకూడదని హితవు చెప్పారు. ఎన్ని ఎక్కువ కేసులుంటే అంతగా పోరాట పటిమ ఉన్నవారని తాను గుర్తిస్తానని పరోక్షంగా చెబుతూనే, వారు మాత్రమే ప్రజల దృష్టి అంతగా ఆకర్షించవచ్చని కూడా అన్నారాయన.
ప్రజాస్వామ్య రాజ్యంలో అరెస్టులు అన్నవి చాలా చిన్న పనులు. అరెస్టు అయితేనే ప్రజలకు ఓ విపక్ష నేత ఏం చేశాడో అన్నది తెలుస్తుంది.లేదంటే సమస్యే మొదటికి వస్తుంది. కనుక నిరసనలు తెలిపి, ప్రజాస్వామ్య పంథాలో పేరు తెచ్చుకోవడం ఆ విధంగా పార్టీలలో ఊపు మరియు ఉత్సాహం తీసుకుని రావడం, జవం మరియు జీవం నింపడం ఇప్పుడు అత్యావస్యకం.
ఈ నేపథ్యంలో నిన్నటి వేళ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు కొన్ని మంచి విషయాలే నమోదు అయ్యాయి. అంటే మీరు ఎక్కువ కేసులుంటే భయపడకండి, అవన్నీ దొంగ కేసులే కావొచ్చు.. నేను అధికారంలోకి రాగానే తీయించి వేస్తాను అని చెప్పి, కార్యకర్తల్లో ధైర్యం నింపారు. వీటిపై ఒక అడ్మినల్ ట్రైబ్యునల్ వేస్తానని కూడా చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పెద్ద పెద్ద నాయకులే కేసులంటే హడలి పోతుంటే కార్యకర్తలు అంతవరకూ వెళ్లి తిరిగి కోర్టుల చుట్టూ తిరిగి తమ కాలాన్ని ఎందుకు పార్టీ కోసం వెచ్చించాలని ?