రిలీజ్‌కు ముందే కమల్ సినిమాకు ప్రాఫిట్స్..‘విక్రమ్’తో ఇక రికార్డులే

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి మరీ నటించేస్తుంటారు కమల్ హాసన్. అయితే, ఇటీవల కాలంలో కమల్ హాసన్ నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. దానికి తోడు కరోనా పరిస్థితుల వలన ఆయన నటించిన పిక్చర్స్ రిలీజ్ కూడా కాలేదు. కాగా, ఓ సినిమాకు మాత్రం రిలీజ్ ముందే ప్రాఫిట్స్ రావడం విశేషం.

కమల్ హాసన్ హీరోగా ‘ఖైదీ, మాస్టర్’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫిల్మ్ ‘విక్రమ్’. ఈ సినిమాలో విక్రమ్ గెటప్ వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నదన్న సంగతి విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించడం.

ఈ ఏడాది జూన్ 3న చిత్రం విడుదల కానుంది. కాగా, చిత్ర విడుదలకు ముందరే మేకర్స్ కు లాభాలు వచ్చేశాయి.ఎలాగంటే..ఈ చిత్రానికి శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు రూ.125 కోట్లకు అమ్ముడు పోయాయి. స్టార్‌ గ్రూపు సంస్థ ఈ ఫిల్మ్ శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకోగా, డిజిటల్‌ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ OTT సొంతం చేసుకుంది. దాంతో సినిమా మేకర్స్ కు లాభాలు వచ్చేశాయి. పిక్చర్ బడ్జెట్‌ రూ.100 కోట్లు కాగా, అప్పుడే ఆ అమౌంట్ వచ్చేసింది.

ఆర్‌.మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ తన ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ పై ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు. అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ పిక్చర్ ట్రైలర్‌ ఈ నెల 15న రిలీజ్‌కానుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూరుస్తుండగా, కమల్ హాసన్ కు ఇది 232వ చిత్రం కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news