తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..ఉప్పుడు బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ !

-

ఉప్పుడు బియ్యం విషయంలో సానుకూల వైఖరి కనబర్చని కేంద్రం.. ఎట్టకేలకు మనసు మార్చుకుంది. గత యాసంగి సీజన్‌ లో 92.34 లక్షల మెట్రిక్‌ టన్నునల వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో నుంచి 62.52 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది.

సాధారణ బియ్యం ఇవ్వడానికి ముందుకు రాని మిల్లర్లు… 56.47 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఇచ్చారు. దీంతో ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇస్తామంటూ కేంద్రానికి కేసీఆర్‌ సర్కార్‌ అనేక సార్లు లేఖలు రాసింది. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు.

దీంతో ఈ విషయమై సీఎం కేసీఆర్‌, మంత్రులు కేంద్రంపై ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీ నేతలు సైతం అలాగే బదులు ఇచ్చారు. బాయిల్డ్ రైస్‌ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news