సీఎం జగనుకు నారా లోకేష్ లేఖ రాశారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ లేఖలో లోకేష్ వెల్లడించారు.రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి రైతుల్లేని రాజ్యంగా ఏపీని మార్చారు..రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభం.. వారి తండ్రిగారి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని హెచ్చరించారు. జగన్ దరిద్ర పాదం ఎఫెక్టుతో రైతు రాజ్యం దేవుడెరుగు రైతు బ్రతికుంటే అదే పదివేలు అనేలా దుస్థితి ఉందనీ..అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు? అని నిలదీశారు.
మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా? అని నిప్పులు చెరిగారు. రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా ?రూ. 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ? అని మండిపడ్డారు.ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ?తుఫాన్లు, అకాల వర్షాలతో, నష్టపోయి రైతులకు పంట నష్టం పరిహారం ఎంత ఇచ్చారు? అని ఆగ్రహించారు.
పంటలబీమా ప్రీమియం కట్టామన్నారు.. రైతులకి ఇన్సూరెన్స్ వర్తించలేదెందుకు? రూ.12,500 రైతు భరోసా ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు? అని నిప్పులు చెరిగారు.రాష్ట్రవ్యాప్తంగా వున్న కౌలు రైతులని అసలు గుర్తించారా?వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి ? అని ప్రశ్నించారు.