రాకేష్ టికాయత్ కు షాక్…. బహిష్కరించిన బీకేయూ

రాకేష్ టికాయత్ దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో రైతుల ఆందోళన జరిగింది. అయితే ఈ ఉద్యమానికి సారథ్యం వహించన వ్యక్తుల్లో కీలకంగా వ్యవహరించిన వారు భారత్ కిసాన్ యూనియన్( బీకేయూ) నేత రాకేష్ టికాయత్. రైతు ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈయన పేరు మారుమోగింది. రైతుల ఆందోళనలను ముందుండి నడిపించారు రాకేష్ టికాయత్.

ఇదిలా ఉంటే తాజాగా బీకేయూ నేత రాకేష్ టికాయత్ కు షాక్ తగిలింది. భారత కిసాన్ యూనియన్ నుంచి రాకేష్ టికాయత్ ను బహిష్కరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా నాయకత్వం వహించిన రాకేష్ టికాయత్ తో పాటు ఆయన సోదరుడు బీకేయూ అధ్యక్షడు నరేష్ టికాయత్ ను బీకేయూ నుంచి తొలగించారు. రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం టికాయత్ పనిచేస్తున్నారని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బీకేయూ కొత్త చీఫ్ గా రాజేష్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు.