పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

-

ఢిల్లీ : పెగాసస్ స్పై వేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పెగాసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని తెలిపిన సిజేఐ ఎన్వి రమణ.. మాల్‌వేర్‌ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్‌ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్‌ కమిటీ తెలిపిందన్నారు.

టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందన్న సిజేఐ.. తుది నివేదికను సమర్పించేందుకు సమయం కోరిన టెక్నికల్ కమిటీ.. అంగీకరించారు. మొబైల్ పరికరాల పరిశీలనను వేగవంతం చేయడానికి ,తుది నివేదికను అందజేయడానికి సాంకేతిక కమిటీకి నాలుగు వారాల సమయం ఇచ్చిన సిజేఐ.. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేశారు. అయితే.. టెక్నికల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు న్యాయవాది కపిల్ సిబల్. టెక్నికల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న సిబల్ వాదనను వ్యతిరేకించిన సొలొసిటరీ జనరల్..దీన్ని మధ్యంతర నివేదికగా చూడాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news