ఎవరెన్ని కుట్రలు చేసినా మహానాడు ఆగదు : అచ్చెన్నాయుడు

-

ఈ నెల 28, 29 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒంగోలులోనే మకాం వేసి మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యానని వెల్లడించారు. తమ మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. మహానాడును విఫలం చేయాలని ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సమష్టి కృషితో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని అచ్చెన్నాయుడు వివరించారు.

Former Andhra Min and TDP MLA K Atchannaidu held for alleged involvement in  ESI scam | The News Minute

రేపటి మహానాడుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా అచ్చెన్న సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. “సీఎం జగన్ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశామంటున్నాడు. 2014లో టీడీపీకి 103 స్థానాలు వస్తే 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది. కానీ జగన్ 151 స్థానాలు గెలిచి 10 మందికే మంత్రి పదవులు ఇచ్చాడు. ఆ లెక్కన చూస్తే ఏ పార్టీ సామాజిక న్యాయం పాటించినట్టు?” అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news